|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 11:23 AM
HYD కెపీహెచ్‌బీ పీఎస్ పరిధిలోని శ్రీనివాస్‌నగర్ కాలనీకి చెందిన సుబ్బారావు తన భార్య కోసం రూ.18వేల ధర ఉన్న ట్యాబ్‌ని అమెజాన్‌లో ఆర్డర్ చేశారు. వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చిన ఆర్డర్ ఓపెన్ చేసిచూడగా అందులో ట్యాబుకు బదులు లైఫ్‌బాయ్ సోప్స్ కనిపించాయి. దీంతో కస్టమర్ ఒక్కసారిగా కంగారు పడ్డాడు. ఈ విషయంపై కెపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని సుబ్బారావు వెల్లడించారు.