|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 10:47 AM
నూతన మంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని నీలం మధు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా హైదరాబాద్ ఆరామ్ గార్ లోనీ మంత్రి నివాసంలో ఆయనను కలిసి పూల బొకే అందించి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా నీలం మధుని మంత్రి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకుని సాదరంగా ఆహ్వానించి ఇరువురు శాలువలతో సత్కరించుకున్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని అమలు చేస్తూ అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తూ మన వర్గాల సమస్యలు,ఆర్థికాభివృద్ధి, రాజకీయ అవకాశాలకు కృషి చేద్దామని చర్చించుకున్నారు.