|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 12:27 PM
కాంగ్రెస్ ఎంపీ మల్లు రవికి మీనాక్షి నటరాజన్ వార్నింగ్. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజే మీనాక్షి నటరాజన్ తో తిట్లు తిన్న మల్లు రవి. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవి రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి భారీ ర్యాలీ తీసి, గాంధీ భవన్ వద్ద టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టిన మల్లు రవి అనుచరులు. అదే రోజు మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్ళిన మల్లు రవికి క్లాస్ పీకిన మీనాక్షి నటరాజన్ . క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవి వస్తే ఇంత హంగామా అవసరమా, ఎందుకు ఇంత హడావిడి చేశారంటూ మల్లు రవికి చీవాట్లు పెట్టిన మీనాక్షి నటరాజన్. ఇటీవల పార్టీలో చేరిన అచ్చంపేట కాంగ్రెస్ నాయకుడు నిరంజన్ రెడ్డికి పదవి ఇవ్వడానికి ఎందుకు లాబీయింగ్ చేశారు, భవిష్యత్తులో నిరంజన్ రెడ్డి పార్టీ మారితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ మల్లు రవిని నిలదీసిన మీనాక్షి నటరాజన్