|
|
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 11:52 AM
చింతకాని మండల కేంద్రానికి పునరుద్ధరించిన బస్సు సర్వీస్ ను తహసీల్దార్ కూరపాటి అనంతరాజు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజల విజ్ఞప్తి మేరకు మల్లు భట్టి ఆదేశాలతో అధికారులు సర్వీస్ ఏర్పాటుచేశారని తెలిపారు. ఎస్సై నాగుల్ మీరా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్, సీపీఐ నాయకులు మడుపల్లి భాస్కర్, గోవిందరావు ఉన్నారు.