|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 11:05 AM
ప్రముఖ సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతి కార్యక్రమాన్ని గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎండీ అశోక్ రెడ్డి హాజరై భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆనాటి సమాజంలో పేరుకుపోయిన అసమానతలు, దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని పేర్కొన్నారు. బాలికా విద్య కోసం ఆనాడే పరితపించిన మహనీయుడన్నారు. సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ఆయన రచయితగా, పాత్రికేయుడిగానూ పోరాడారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్లు సుదర్శన్, శ్రీధర్, ఆపరేషన్ డైరెక్టర్-1 అమరేందర్ రెడ్డి, పర్సనల్ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, సీజీఎం, జీఎంలు ఇతర అధికారులు పాల్గొన్నారు.