![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 02:56 PM
ఐకానిక్ చిత్రం నాయకన్ తర్వాత ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం మరియు కమల్ హాసన్ యొక్క అత్యంత అంచనాల ప్రాజెక్ట్ 'థగ్ లైఫ్' వారి కలయికను సూచించే పీరియాడికల్ యాక్షన్ డ్రామా. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ ని షుగర్ బేబీ అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సాంగ్ యూట్యూబ్ లో 10 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో సిలంబరసన్ టిఆర్ కీలక పాత్రలో నటిస్తుండగా, త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, అశోక్ సెల్వన్, నాజర్, ఢిల్లీ గణేష్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, సన్యా మల్హోత్రా, జోజు జార్జ్, జిషు సేన్‌గుప్తా, రోహిత్ సరాఫ్, వైయాపురి మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. సాంకేతిక బృందంలో ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా రవి కె చంద్రన్, ఎడిటర్‌గా ఎ శ్రీకర్ ప్రసాద్ మరియు యాక్షన్ కొరియోగ్రఫీని అన్బరివు ద్వయం నిర్వహిస్తున్నారు. మద్రాస్ టాకీస్ మరియు ఆర్‌కెఎఫ్‌ఐ సంయుక్తంగా నిర్మించిన థగ్ లైఫ్ తమిళ చిత్రసీమలో అత్యంత అంచనాలున్న ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా మద్రాస్ టాకీస్ మరియు రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్స్ కింద నిర్మించబడింది. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ రేపు సాయంత్రం 5 గంటలకి జరుగనుంది.
Latest News