|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 11:51 AM
TG: ‘మొంథా' తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించగా.. తాజాగా నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పిల్లల్ని బయటికి పంపించొద్దని తల్లిదండ్రులకు అధికారులు సూచించారు.