|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 11:13 AM
మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణరావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి. సత్యనారాయణ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ తదితర బీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తన్నీరు సత్యనారాయణ మృతిపట్ల సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు. హరీశ్‌రావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరీశ్‌రావు తండ్రి, తన బావ (7వ సోదరి, అక్క లక్ష్మీ భర్త) తన్నీరు సత్యనారాయణ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు. సత్యనారాయణతో తనకున్న అనుంబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే హరీశ్‌రావుకు కేసీఆర్ ఫోన్ చేసి కుటుంబసభ్యులను ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.