|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 02:26 PM
ఓ వివాహ వేడుకకు విజయవాడ వెళ్లిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు.. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలకూ అవసరమని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పాలకుల ముందు చూపు.. నిబద్ధత గల అధికారుల పని తీరు ఏ వ్యవస్థకైనా మంచి పేరు తీసుకువస్తాయన్నారు. దేశంలోనే మొట్టమొదటిగా హైడ్రా రూపంలో సరికొత్త వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. కొత్త వ్యవస్థను తీసుకురావడమే కాకుండా.. సరైన అధికారిని నియమించడం.. అధికారాలు కట్టపెట్టడం.. పూర్తి స్వేచ్ఛతో పని చేసే అవకాశం కల్పించడం జరిగితే ఫలితాలు బాగుంటాయన్నారు. ఎంతో నిబద్ధతతో పని చేస్తున్న శ్రీ ఏవీ రంగనాథ్ గారిని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు.