|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 02:09 PM
సరైన కారణం లేకుండా తన నామినేషన్లను ఎలా తిరస్కరిస్తారని జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారిని నిలదీయడంతోపాటు అధికారులపై ఆరోపణలు చేసిన హెచ్‌వైసీ వ్యవస్థాపకుడు, బీఆర్ఎస్ మైనారిటీ నాయకుడు సల్మాన్ ఖాన్ మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. సల్మాన్ ఖాన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేయగా.. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన అనంతరం సల్మాన్ ఖాన్ దాఖలుచేసిన నాలుగు సెట్ల నామినేషన్లను తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి . దీంతో అధికారులతో వాగ్వాదానికి దిగిన సల్మాన్ ఖాన్. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్లో కొన్ని కాలమ్స్ నింపకపోయినా అనుమతించారని, తన నామినేషన్లను మాత్రం ఎలా తిరస్కరించారంటూ ప్రశ్నించడంతో.. రంగంలోకి దిగిన సల్మాన్ ఖాన్‌ను అక్కడినుంచి బయటకు పంపించిన పోలీసులు. అనంతరం రిటర్నింగ్ అధికారి సాయిరామ్ ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు