|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 06:35 PM
శేరిలింగంపల్లి చందానగర్ అండర్‌పాస్‌లో నిలిచిన వర్షపు నీటిని ముచ్చటగా 5 వ సారి తీయించిన మారబోయిన రవి యాదవ్. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీ మారబోయిన రవి యాదవ్ గారు స్వయంగా తన సొంత నిధులతో పాపిరెడ్డి కాలనీ - చందానగర్ నీట మునిగిన అండర్ పాస్ దారిని, నీటిని తొలగింపజేసి పాపిరెడ్డి కాలనీ, వామ్బె అపార్ట్మెంట్లు, సందయ్య నగర్, రాజీవ్ గృహకల్ప, మరియు ఆరంభటౌన్ షిప్ ప్రజలకు దీపావళి కానుకగా అంకితం ఇచ్చారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడి నెల రోజులు గడుస్తున్న పట్టించుకోని నాయకులు, ప్రభుత్వ అధికారులు అని రవిగారు దుయ్యబట్టారు. స్థలాన్ని పరిశీలించిన అనంతరం తక్షణం పరిష్కారం చేయడానికి శ్రీ రవి యాదవ్ గారు తమ ఖర్చుతో ఆయిల్ ఇంజన్ పంప్‌లను ఏర్పాటు చేయించి ఆయన దాతృత్వం చాటుకున్నారు. రోడ్లపై వేసిన చెత్త ఎక్కడికక్కడ అలాగే ఉందని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు స్పందించడం లేదని ముఖ్యంగా బ్రిడ్జి చుట్టుపక్కల మట్టి, బూడిద తీయించాలిసిందిగా GHMC సిబ్బందిని కోరడం జరిగింది. ప్రజలు క్షేమమే మా ప్రధాన లక్ష్యంగా బావించి మేము ఈ బస్తీ బాట కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా రవియాదవ్ గారు చెప్పడం జరిగింది.వెంకట్ రెడ్డి , సాయి నందన్ ముదిరాజ్* మరియు *బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు* సమిష్టిగా కృషి చేయడంతో వంతెనపై నిల్వ ఉన్న నీటిని తొలగించి, **రోడ్డు మళ్లీ ప్రజల కోసం తెరవడం జరిగింది**. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజల సౌకర్యం కోసం నిరంతరం కృషి చేస్తున్న *బీఆర్ఎస్ నాయకత్వానికి అభినందనలు*.ఈ కార్యక్రమం లో మల్లేష్ ముదిరాజ్, వెంకటరెడ్డి, వెంకటాచారి, గడ్డం శ్రీనివాస్, కొండకల్ శ్రీనివాస్, ఆర్.జమ్మయ్య, గంగాధర్ గౌడ్, అనిల్ గౌడ్, నవీన్ గౌడ్, సాయి నందన్ ముదిరాజ్, పవన్, రాజు గౌడ్, శ్రీకాంత్ యాదవ్, శంకర్, వద్దే శ్రీనివాస్, శ్రీశైలం యాదవ్, జంగయ్య, కె రాజు చారి, రమేష్, వెంకట్ యాదవ్, ప్రేమ్, అనిల్ యాదవ్, సతీష్ గౌడ్, మున్నా, శివాజీ, వెంకట్, కృష్ణ, అల్లం, ఐలు మల్లయ్య, నర్సింహా, ప్రవీణ్ యాదవ్, బాలరాజ్, రజాక్, శశికళ, రామ దేవి, స్వరూప, దివ్వ్య, నిరూప, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.