|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 01:43 PM
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, గురువారం నుంచి జెడ్పిటిసి, ఎంపిటిసిల నామినేషన్లు స్వీకరించనున్న నేపథ్యంలో మణుగూరు ఎంపీడీవో కార్యాలయంలో డిఎస్పి రవీందర్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయం చుట్టూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో సిఐ నాగబాబు, ఎస్సై నగేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.