|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 01:48 PM
చౌటుప్పల్ మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన హోంగార్డు ఉపేందర్ చారి, రామన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 4:18 గంటలకు సుభాష్ సెంటర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా, ఒక లారీ ఆపకుండా అతనిపై దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఉపేందర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.