|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 02:03 PM
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురువారం మీడియాకు మాట్లాడుతూ, పోలీస్ కమీషనరేట్ పరిధిలోని మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రతే షీ టీం లక్ష్యమని తెలిపారు. కమిషనరేట్ లో రెండు షీ టీం బృందాలు పనిచేస్తున్నాయని, మహిళలు, బాలికలపై ఆన్లైన్లో అసభ్యకర పోస్టులు పెట్టేవారు, సైబర్ నేరగాళ్లపై సైబర్, షీ టీమ్ సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. మహిళలు, బాలికలు, విద్యార్థులు షీ టీం సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.