|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 02:39 PM
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ది మాస్టర్ మైండ్స్ హై స్కూల్‌లో చదువుకుంటున్న తోరగల్లు గ్రామానికి చెందిన పాప, గత నెల 4వ తేదీన స్కూల్ బస్సు దిగే క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు కింద పడి మృతి చెందింది. ఈ ఘటన నేపథ్యంలో, కలెక్టర్ ఆదేశాల మేరకు మరుసటి రోజు ఎంఈఓ మరియు విద్యాశాఖ అధికారులు స్కూల్‌ను సీజ్ చేశారు. దీంతో సుమారు 300 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళింది. స్కూల్ మూసివేయడంతో తరగతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.