|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 10:47 AM
సృష్టి ఫర్టిలిటీ మోసం కేసులో డాక్టర్ నమ్రత పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నమ్రత సరోగసీ పేరిట దంపతుల నుంచి రూ.30–40 లక్షలు వసూలు చేసి, అక్రమంగా శిశువులను కొనుగోలు చేసి అప్పజెప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 80 మంది దంపతులకు ఇదే తంతు సాగినట్టు దర్యాప్తులో వెల్లడైంది. 80 మంది పిల్లల వ్యవహారం బయటపడటంతో ఆ వివరాలు రాబట్టేందుకు ఆమెను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు.