|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 06:01 PM
TG: ఘోష్ కమిషన్ ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ నివేదిక అంతా ట్రాష్, గ్యాస్ అని KTR మండిపడ్డారు. 655 పేజీల నివేదికను 60 పేజీలకు కుదించడంలోనే కాంగ్రెస్ నాయకుల బాగోతం అర్థం అయిపోయిందని ఎద్దేవా చేశారు. 'సాయంత్రం రిపోర్ట్ రాగానే అర్ధరాత్రి తమ ఆస్థాన మీడియాకు లీకులు ఇచ్చి, అడ్డమైన రోత వార్తలు రాయించుకొని, KCR, BRS మీద కుట్ర చేస్తున్నారు. దమ్ముంటే మైక్ కట్ చేయకుండా అసెంబ్లీలో చర్చ పెట్టు. చీల్చి చెండాడే బాధ్యత మాది' అని చెప్పారు.