|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 12:29 PM
జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేసిందని బిఆర్ఎస్వి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్, బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు సోమవారం బిఆర్ఎస్వి నాయకులతో ర్యాలీ నిర్వహించి ఉట్నూర్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్, బిఆర్ఎస్వి నాయకులు సాజిద్ బాబా, శ్యామ్ టైగర్, జయ చంద్ర, నరేష్, సూర్య కాంత్ యాదవ్, దినేష్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.