|
|
by Suryaa Desk | Tue, Jul 15, 2025, 03:22 PM
మెరుగైన పారిశ్రామిక విధానాలతో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ శామీర్‌పేటలోని జీనోమ్‌వ్యాలీలో 'ఐకోర్ బయోలాజిక్స్' పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం మాట్లాడారు. తెలంగాణలో పార్టీలు, ప్రభుత్వాలు మారినా పరిశ్రమలకు సంబంధించిన విధానాలు మారలేదని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా వేగంగా అభివృద్ది చేసే ప్రయత్నం చేస్తోందని సీఎం తెలిపారు.