|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 11:03 AM
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలర్ దేవ్ పల్లి డివిజన్ వాంబే కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం పాల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నిత్యవసర విద్యా సామగ్రి (స్టేషనరీ) పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు పాఠశాల విద్యార్థుల అవసరాలను తీర్చడమే కాకుండా, చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయన్నారు.