|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 11:21 AM
మహబూబ్ నగర్ విజన్ 2047 లో న్యాయవాదులు అందరూ భాగస్వాములు కావాలని సోమవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన మహబూబ్ నగర్ ప్రతిష్ఠను గత ప్రభుత్వం గుర్తించలేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక్క కుటుంబం గుప్పిట్లోనే రాష్ట్రాన్ని ఉంచుకున్నారని అన్నారు.