![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 02:02 PM
భారతి రంగ ఆర్గనైజేషన్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో టీబీ వైద్య సిబ్బంది పట్టణ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్య, వైద్య సిబ్బందిచే 44 మంది టీబీ పేషెంట్లకు ఆరు నెలలకు సరిపడా న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్య మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు లేని జీవితం కోసం ఆరోగ్యవంతమైన జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఎంతో అవసరం అన్నారు.