![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 02:03 PM
సంగారెడ్డి(D) పాశమైలారం ఘోర అగ్నిప్రమాద ఘటనలో పలువురు కార్మికులు మృతి చెందడం పట్ల BRS అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ జరిపించాలని, క్షత గాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన కార్మికులు ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని సూచించారు.