![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 02:06 PM
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మెగా జాబ్ మేళా ఘన విజయవంతం – 500 మందికి ఉద్యోగాలు, మరో 1000 మందికి నియామక పత్రాలు సిద్ధం..నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి అపూర్వ స్పందన లభించింది. పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్స్‌లో జరిగిన ఈ జాబ్ మేళాలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి యువతీ యువకులు భారీగా హాజరయ్యారు.ఈ మేళాలో 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నా, 2000 మందికి పైగా యువత రిజిస్ట్రేషన్ చేయించుకోవడం విశేషం. టెక్ మహింద్రా,MRF, టాటా, ICICI, SBI లైఫ్ ఇన్సూరెన్స్, జెప్టో తదితర ప్రఖ్యాత కంపెనీలతో పాటు మొత్తం 60 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి.ఇంటర్వ్యూల్లో మెరిసిన 500 మంది యువతకు అక్కడే ఉద్యోగాలు లభించాయి. ఎంపికైన అభ్యర్థులకు ఆవుల రాజిరెడ్డి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించడమే కాక, మరిన్ని నియామక పత్రాలు మూడు నాలుగు రోజుల్లో మరో వెయ్యిమందికి అందించనున్నట్లు వెల్లడించారు.
ఉచిత రిజిస్ట్రేషన్‌తో పాటు ఉచిత భోజన వసతి కూడా ఏర్పాటు చేయడంతో యువతతో పాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ “నిరుద్యోగ యువత లేని నర్సాపూర్ నా లక్ష్యం. రాబోయే మూడున్నరేళ్లలో నియోజకవర్గం మొత్తం మీద 20వేల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే నా ధ్యేయం,” అని తెలిపారు.