![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 02:43 PM
ప్రజా ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. సోమవారం సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లి, భూపతిపూర్ గ్రామాల్లో పలు సిసి రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్స్ అందజేసారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.