![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 02:44 PM
BRS పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు.. రేవంత్ పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణమని ఆ పార్టీ నేత హరీశ్ రావు అన్నారు. విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి లక్షల మంది SC, ST, BC పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని చెప్పారు. జనవరి నుండి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ప్రభుత్వ స్కూళ్లలో కోడిగుడ్లు, మాంసం, అరటి పండ్ల సరఫరా నిలిచిపోయాయని పేర్కొన్నారు.