![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 01:54 PM
అంతగ్రామ్ మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు తగ్గడంతో అందులో మునిగిపోయిన మూల్మూర్, ఎల్లంపల్లిగ్రామాలు బయటపడ్డాయి. ఇండ్ల శిథిలాలను చూస్తే గుండె బరువెక్కుతుంది అని సోమవారం భూ నిర్వాసితులు రోదిస్తూ తెలిపారు. గ్రామాలు బయటపడడంతో తమ ఇళ్ల శిథిలాలకు వెళ్లి తీపి జ్ఞాపకాలను నెమ్మరు వేసుకుంటున్నారు. ఎంతో ప్రేమ అనురాగాలతో కలిసి మెలిసి ఉన్న గ్రామస్తులు ప్రస్తుతం చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.