![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 01:59 PM
సమాజ సేవలో ముందు ఉంటామని, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు అన్నారు. స్థానిక డాక్టర్లు విటల్ బాబు శ్రీవాణి ల విఠల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి లో 10వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో డాక్టర్లు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ నేత్రదానం, రక్తదానం, అవయవ దానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దామర యాదయ్య, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ సుధాకర్, డాక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు.