|
|
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 10:34 AM
TG: హైదరాబాద్ నగర శివారు కొండకల్‌లో ఓ యువతి కారుతో రైల్వే ట్రాక్‌పై హల్‌చల్ చేసింది. రైల్వే ట్రాక్‌పై కారు నడిపింది. కొండకల్ నుంచి శంకర్‌పల్లి వరకు పట్టాలపై కారు డ్రైవింగ్ చేసింది. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వారు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. కారు ఆపాలని చెప్పినా ఆమె వినకుండా డ్రైవింగ్ చేసింది. చివరికి కష్టపడి కారు ఆపారు. అయితే గంజాయి మత్తులో యువతి అలా చేసినట్లు అనుమానిస్తున్నారు.