![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 10:37 AM
ఓయో రూములో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న యువతి . ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. స్నేహితులతో హోటల్లో పార్టీ చేసుకోవడానికి వెళ్ళి, ఉదయం డోరు తెరిచే సరికి ఫ్యానుకు ఉరివేసుకొని కనిపించిన యువతి . నల్గొండ జిల్లాకు చెందిన అనూష(26) అనే యువతి భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకొని తల్లిదండ్రుల వద్దే ఉంటూ బ్యూటీషియన్‌గా పని చేస్తుంది. ఈ నెల 22వ తేదీన స్నేహితుల ఇంటికి వెళ్లొస్తానని చెప్పిన అనూష తిరిగి రాకపోవడంతో, పోలీసులకు ఫిర్యాదు చేసిన అనూష తల్లిదండ్రులు . హైదరాబాద్–రాయదుర్గంలోని క్యూబా ఓయోలో యువతి ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందడంతో, ఘటనా స్థలానికి చేరుకొని చనిపోయిన యువతిని అనూషగా నిర్ధారించిన పోలీసులు . అనుషను హత్య చేసి ఆత్మహత్య లాగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు