![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 10:30 AM
దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బుధవారం నల్గొండలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక అవగాహన సదస్సుకు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా పార్టీలో నూతనంగా చేరిన సుమారు 30మంది యువకులకు బీజేపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ అరాచకాలను నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయం నుంచి క్లాక్ టవర్ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొనన్నారు.