|
|
by Suryaa Desk | Thu, May 15, 2025, 11:31 AM
యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ సమీపంలో డెమో ప్యాసింజర్ రైలు కింది భాగంలో మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తున్న ఈ రైలులో ఈ ఘటన జరిగింది. మంటలను గమనించిన ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు.
దీంతో బీబీనగర్ వద్ద రైలును నిలిపివేశారు. సిబ్బంది త్వరగా సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ చర్యలతో పెను ప్రమాదం తప్పింది. ఘటన అనంతరం రైలు గంటపాటు బీబీనగర్‌లో నిలిచిపోయింది. ప్రయాణికులు ఈ సంఘటనతో భయాందోళనకు గురైనప్పటికీ, సకాలంలో చర్యలతో ఊపిరి పీల్చుకున్నారు.