![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:24 PM
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చారిత్రక చిత్రం 'హరిహర వీరమల్లు'. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా, తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాట 'అసుర హననం'ను చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేసింది. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News