![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 15, 2025, 02:57 PM
సూర్య, పూజాహెగ్డే జంటగా నటించిన ‘రెట్రో’ చిత్రం మే 1న విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే థియేటర్‌లో రిలీజైనా కేవలం 15 రోజులకే ఈ సినిమా ఓటీటీ (OTT) అప్‌డేట్ వచ్చేసింది. ‘రెట్రో’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకోగా.. స్ట్రీమింగ్‌పై అప్‌డేట్ ఇచ్చింది. ఈ మేరకు ‘తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో రెట్రో త్వరలో ఓటీటీలోకి రాబోతుంది’ అంటూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. అయితే.. రిలీజ్ డేట్ ఇంకా రివీల్ చేయలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో.. కేవలం 15 రోజులకే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం కావడంతో సూర్య ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
Latest News