|
|
by Suryaa Desk | Wed, Sep 24, 2025, 03:47 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'OG' చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, 'మిరాయ్' సినిమా నిర్మాతలు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 'మిరాయ్' నిర్మాత టి.జి. విశ్వప్రసాద్, హీరో తేజ సజ్జా 'OG'కు స్క్రీన్లు ఖాళీ చేసి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. 'OG' విడుదల రోజు 'మిరాయ్' సినిమా ప్రదర్శించబడదు. సెప్టెంబర్ 26 నుంచి మళ్లీ యథావిధిగా ప్రదర్శనలు కొనసాగుతాయి. ఈ నిర్ణయం పట్ల పవన్ అభిమానులు, సినీ లవర్స్ 'మిరాయ్' టీమ్‌ను ప్రశంసిస్తున్నారు.
Latest News