|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 07:19 PM
రాయికోడ్ మండల కేంద్రంలో మంగళవారం విద్యుత్ శాఖ అధికారులు బస్తిబాట కార్యక్రమం నిర్వహించారు. ఏడిఈ రజినీకాంత్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి విద్యుత్ సరఫరా నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. వోల్టేజి సమస్యలు, డ్యామేజ్ స్తంభాలు వంటి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఏడిఈ రజినీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ మోహన్, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జగన్ రెడ్డి, జూనియర్ లైన్మెన్ మక్సూద్, ప్రకాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.