|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 07:26 PM
సైబర్ నేరాల్లో డబ్బు రికవరీకి అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, బాధితులు వెంటనే స్పందిస్తే కొంత అవకాశం ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. వెంటనే '1930' హెల్ప్‌లైన్ కు కాల్, 'నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్'లో ఫిర్యాదు చేయాలంటున్నారు. వెంటనే పోలీసులు, బ్యాంక్ అధికారులు విచారణతో, డబ్బు బదిలీ అయిన ఖాతాలను ఫ్రీజ్ చేస్తారు. మోసం జరిగిన అరగంటలోపు ఫిర్యాదు చేస్తే ఎక్కువ శాతం రికవరీకి అవకాశాలున్నాయంటున్నారు.