|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 07:18 PM
TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. 'జన బాట' కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన కవిత, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని కరివెన రిజర్వాయర్ ను పరిశీలించారు. కేసీఆర్ హయాంలో 80% పూర్తయిన ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా ముందుకు కదలలేదని ఆమె ఆరోపించారు. పాలమూరు ప్రజలకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని, వారు ఆయనను క్షమించబోరని కవిత మండిపడ్డారు.