|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 07:16 PM
TG: యూసుఫ్‌గూడలో సినీ కార్మికుల అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. హాలీవుడ్‌ను తెలుగు చిత్ర పరిశ్రమకు తీసుకువచ్చే బాధ్యత తనదేనని, చిన్న సినిమాలను తక్కువచేసి చూడబోమని ఆయన అన్నారు. సినీ కార్మికుల శ్రమను తాను గుర్తించానని, అధికారంతో కళ్లు మూసుకుపోలేదని, వారి కష్టాలు తనకు తెలుసునని తెలిపారు. ఆస్కార్ స్థాయికి తెలుగు పరిశ్రమ ఎదగడానికి కార్మికులే కారణమని సీఎం ప్రశంసించారు.