|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 06:06 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమీపిస్తున్న వేళ బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ ఎన్నికలో అసలు పోటీ తమకు, ఎంఐఎం పార్టీకి మధ్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోతే, మజ్లిస్ సీట్ల సంఖ్య 8కి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ రావు అధ్యక్షతన ఉపఎన్నికపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. "జూబ్లీహిల్స్‌లో ఎంఐఎంను ఆపాలంటే బీజేపీని గెలిపించాలి. ప్రజల్లో కూడా బీజేపీని గెలిపించాలనే ఆలోచన బలంగా ఉంది" అని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. 2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నాంది పలకాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.