|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 02:00 PM
కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరుకున్న గల్ఫ్ బాధితుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామం నుండి పొట్టకూటి కోసం రెండు నెలల కింద మస్కట్ వెళ్లిన బాలసాని గౌరయ్య. ఏజెంట్ మోసానికి బలై, చాలీచాలని జీతం సరిగ్గా ఇవ్వక, కంపెనీ యజమాని పాస్‌పోర్ట్ లాక్కోవడంతో మస్కట్‌లో చిక్కుకుపోయిన బాధితుడు గౌరయ్య. తనను ఆదుకొని, ఇంటికి తిరిగొచ్చేలా సహాయం చేయాలని గౌరయ్య పెట్టిన సెల్ఫీ వీడియోను చూసి స్పందించి, ఈ నెల 12న మస్కట్ ఎంబసీకి లేఖ రాసిన కేటీఆర్. పాస్‌పోర్ట్ ఇప్పించి గౌరయ్య తిరిగి రావడానికి ఆర్థిక సాయం చేసిన కేటీఆర్.. మస్కట్‌లో గౌరయ్యకు సహాయం చేసిన సామాజిక సేవ కార్యకర్త షేక్ అహ్మద్. ఈ రోజు తెలవారుజామున హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తన కుటుంబసభ్యులను కలిసి కంటతడి పెట్టుకొని, కేటీఆర్‌కు కృతజ్ఞత తెలిపిన గౌరయ్య