|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 04:27 PM
రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాలపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా నియామకాలు చేపట్టడం వల్ల తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరపాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌కు గురువారం లేఖ రాసినట్లు వెల్లడించారు.అదేవిధంగా, విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్ (వీవోఏ)ల హక్కుల కోసం తాను పోరాడతానని కవిత భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద వీవోఏల సంఘం నిర్వహించిన మహాధర్నాకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మద్దతు తెలిపారు. ఎన్నికల హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వీవోఏల వేతనాన్ని రూ.26 వేలకు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. వారి హక్కుల సాధన కోసం లాఠీ దెబ్బలు తినడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆమె అన్నారు.