|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 12:44 PM
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కోసం మధిర ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద పోలీసులు గురువారం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా సెక్యూరిటీ చర్యలను మధిర టౌన్ సీఐ రమేష్, ఎస్ఐ కిషోర్ కుమార్ పర్యవేక్షించారు. అభ్యర్థులు, కార్యకర్తలు శాంతియుత వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేయాలని పోలీసులు సూచించారు.