|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 11:43 AM
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో యూసిర్ షరీఫ్ (29) అనే యువకుడు అతని ఇంట్లోనే బుధవారం దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ పెద్ద కొడుకు కత్తితో దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ, హత్యకు పాల్పడిన ఆమె కొడుకు వివరాలను పోలీసులు వెల్లడించలేదు.