|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 11:55 AM
చెన్నూర్ రజక వాడలో గురువారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పాత ఇంటి ఆవరణలో మేకలను కాస్తున్న సమ్మయ్యకు చెందిన 15 మేకలు ప్రమాదవశాత్తు ప్రహరీ కూలడంతో మృతి చెందాయి. వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు మట్టి గోడలు తడిసి గోడ కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరు మేకలకు గాయాలయ్యాయి. సుమారు రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుడు సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు.