|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 11:13 AM
తెలంగాణలో ప్రేమ వ్యవహారం ఓ దళిత యువతి ప్రియాంక మృతికి దారితీసింది. కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ తన కుమార్తెను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లికి నిరాకరించాడని చివరకు విషపు సూది మందు ఇచ్చి హత్య చేశాడని ఆమె తండ్రి రాంబాబు ఆరోపించారు. ఈ నెల 3వ తేదీ రాత్రి కుమార్తెతో మాట్లాడిన తర్వాత ఆమె పురుగుల మందు తాగినట్లు సమాచారం వచ్చిందని అయితే ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గమధ్యంలో అంబులెన్స్‌ను ఆపి విషపు సూది ఇచ్చారని దీనికి సంబంధించిన ఫోటో కూడా ఉందని పేర్కొన్నారు.