|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 10:44 AM
హైదరాబాద్ వనస్థలిపురం సమీపంలోని మారుతీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన సుధ(42), నర్సింహ దంపతులు బతుకుదెరువుకు 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న 13 ఏళ్ల కుమారుడి కళ్లెదుటే తల్లి సుధ ఉరేసుకుంది. కుటుంబ సమస్యలు, పిల్లల ఆరోగ్య భారం, భర్త మద్యానికి బానిస కావడం వల్ల మనస్తాపానికి గురైన ఆమె మంగళవారం రాత్రి ఉరేసుకుంది. చిన్న కుమారుడు కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.