|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 11:04 AM
జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్ గూడ డివిజన్ పరిధిలోని LN నగర్ కాలనీలో బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు అమ్మాజీ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో పాల్గొని స్వయంగా వంటలు చేసి భోజనాన్ని వడ్డించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి కుమార్తెలు మాగంటి అక్షర, దిశిర గారు అనంతరం వారు కాలనీలో పర్యటించి మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి పనులను కాలని వాసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలని వాసులు మాగంటి గోపీనాథ్ గారు బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా అండగా ఉన్నారని వారి తనయులకు వివరించారు… ఈ కార్యక్రమంలో డివిజన్ జనరల్ సెక్రటరీ నర్సింగ్ దాస్, వేణుగోపాల్, సంతోష్, తల్లారి వెంకటేష్, షబ్బీర్, ఫహీం, స్థానిక నాయకులు, మహిళలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.