|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 10:58 AM
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల భారీ వర్షం కారణంగా, శేరిలింగంపల్లిలోని హుడా ట్రేడ్ సెంటర్ లోని ఒక అపార్ట్మెంట్ సెల్లార్ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. గురువారం ఉదయం అపార్ట్మెంట్ వాసులు సెల్లార్ ను పరిశీలించగా, అది స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది.భారీ వర్షానికి రైల్వే అండర్ పాసింగ్ స్విమ్మింగ్ పూల్ ని తలపిస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. వర్షం కురిసినప్పుడల్లా ఇలాంటి సమస్యలు పునారావృతం అవుతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు.