|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 11:29 AM
సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీలో గత రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా, గురువారం ఉదయం జిన్నారం-జంగంపేట రహదారిపై రాయిని చెరువు నుండి వరద నీరు ప్రవహిస్తోంది. దీనితో రెండు గ్రామాల మధ్య రాకపోకలు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. జిన్నారం కమిషనర్ తిరుపతి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. నీటి ప్రవాహం పెరిగితే రోడ్డును తాత్కాలికంగా మూసివేసే అవకాశం ఉంది.